ఐదు స్థానాల్లో అభ్యర్థుల మార్పు?.. బీఆర్ఎస్ లో కొత్త టెన్షన్

ఐదు స్థానాల్లో  అభ్యర్థుల మార్పు?.. బీఆర్ఎస్ లో కొత్త టెన్షన్

బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ .. ఇవాళ తెలంగాణ భవన్ లో  51 మందికి బీఫామ్ అందజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, షకీల్, జోగురామన్న, మర్రి జనార్థన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి,గణేష్ గుప్తా  నరేంద్ర గౌడర్ ,జాన్సన్ నాయక్, అంజయ్య యాదవ్, పువ్వాడ అజయ్, రేగా కాంతారావు, కొత్త ప్రభాకర్ రెడ్డి,   ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు పలువురికి  కేసీఆర్  బీఫామ్ లు ఇచ్చారు.  

ఇక ఎమ్మెల్సీ కవిత, గంపగోవర్దన్ లకు బీఫామ్ అందజేశారు కేసీఆర్.  అయితే ఇటీవల వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి చనిపోవడంతో ఆయన బీఫామ్ ను కవిత తీసుకున్నారు. అలాగే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ బీఫామ్ ను గంపగోవర్ధన్  తీసుకున్నారు. 

Also Read :- బాలసాని నివాసానికి పొంగులేటి, తుమ్మల

కేసీఆర్  51 మందికే బీఫామ్ లు ఇవ్వడంతో  మిగతా బీఆర్ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. టికెట్ రానివారు తొందరపడొద్దని..ఇంకా అవకాశాలుంటాయని  కేసీఆర్ చెప్పడంతో అభ్యర్థులను మార్చుతారా అనే సందేహం మొదలైంది.  ఎవరిని మారుస్తారోనని అభ్యర్థుల్లో   టెన్షన్ మొదలైంది.  అయితే ఐదు  స్థానాల్లో   కేసీఆర్  అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది.  అందులో అలంపూర్, కోదాడ, వరంగల్ ఈస్ట్,మహబూబాబాద్ , సంగారెడ్డి  అని ప్రచారం జరుగుతోంది.