బాలసాని నివాసానికి పొంగులేటి, తుమ్మల

బాలసాని నివాసానికి పొంగులేటి, తుమ్మల

భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నివాసానికి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లి ఆయనను కలిశారు. తుమ్మల నాగేశ్వర రావు ప్రధాన అనుచరుడైన బాలసాని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి ఆదివారం(అక్టోబర్ 15) ఉదయం రాజీనామా  చేశారు.   బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కెసిఆర్ కు లేఖ పంపారు.  

  ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  తుమ్మల నాగేశ్వరరావులు బాలసాని నివాసానికి  మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా బాలసానిని కాంగ్రెస్ పార్టీలోకి వారు ఆహ్వానించినట్లు సమాచారం. బాలసాని కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు  తెలుస్తోంది.  కాగా,  బిఆర్ఎస్ పార్టీ బాలసానికి  ఇటీవల భద్రాచలం నియోజక వర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు ఇచ్చినట్లే ఇచ్చి అకస్మాత్తుగా తొలగించింది.