చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత.. ఖైదీ జాబ్రీపై మరో ఖైదీ హత్యాయత్నం

చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత.. ఖైదీ జాబ్రీపై మరో ఖైదీ హత్యాయత్నం

హైదరాబాద్: చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత నెలకొంది. చంచల్ గూడ జైలులో ఖైదీ జాబ్రీపై.. దస్తగిరి అనే మరో ఖైదీ హత్యా యత్నం చేశాడు. ఖైదీల ఘర్షణలో ములాఖాత్ రూమ్లోని అద్దాలు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఖైదీ జాబ్రీనీ జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. 2024 ఏప్రిల్ లో కూడా ఈ తరహా ఘటన చర్లపల్లి జైలులో కూడా జరిగింది. చర్లపల్లి జైలులో కొందరు ఖైదీలు గంజాయి కోసం గొడవకు దిగారు. జైలు సిబ్బందిపైనా దాడి చేశారు.

గొడవకు దిగిన నలుగురు ఖైదీలను అధికారులు అదుపులోకి తీసుకొని వేరే బ్యారెక్స్‌‌‌లోకి తరలించారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ కొంతమంది అండర్‌ ట్రయల్‌‌‌‌ ఖైదీలను చంచల్‌‌‌‌ గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అందులో గంజాయికి అడిక్ట్​అయిన వారు కూడా ఉన్నారు. చర్లపల్లి జైలులో సాధారణ ఖైదీలతో వారిని రిమాండ్‌‌‌‌ చేశారు. గంజాయికి అలవాటుపడ్డ వారు తమకు గంజాయి కావాలని చాలాసార్లు జైలు సిబ్బందితో గొడవపడ్డారు. బ్యారక్‌‌‌‌లో ఉన్న మిగతా ఖైదీలతోనూ వాగ్వాదానికి దిగారు.