నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో ఉద్రిక్తత

నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో ఉద్రిక్తత

నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రోగి మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో డాక్టర్లపై దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకోవడంతో డాక్టర్లు సహనం కోల్పోయారు. పోలీసుల సమక్షంలోనే బాధితులపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఇదిలా ఉంటే నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్స్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ ఐఎంఏ సభ్యులు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. ఘటనను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా డాక్టర్స్ నిరసనకు దిగారు. మరోవైపు నల్లగొండ జిల్లా ఆస్పత్రి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఒక్క నెలలోనే ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.