స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ర్యాలీ

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ర్యాలీ

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడ్లపూడు వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వడ్లపూడు వద్ద ఉక్కు ఉద్యోగుల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆందోళనకారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

ఈనెల 12న ప్రధాని మోడీ పర్యటన ఉండటంతో విశాఖ ఉక్కును కాపాడాలంటూ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో కార్మికులు, ఉద్యోగులు డప్పు వాయిస్తూ గో బ్యాక్ మోడీ నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు.