కూలీల నిరసనలో ఉద్రిక్తత.. మహిళలపై కర్రలతో దాడి

కూలీల నిరసనలో ఉద్రిక్తత.. మహిళలపై కర్రలతో దాడి

ఖమ్మం జిల్లాలో కూలీల వేతనం కోసం జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు కారణమైంది. మధిర మండలం మాటూరు గ్రామంలో.. కూలీలు రోజువారీ కనీస వేతనం 3వందల రూపాయలు ఇవ్వాలని నిరసన ప్రదర్శన చేశారు. వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్రామంలో రోజు వారి కనీస వేతనం 300 రూపాయలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అదే సమయంలో.. కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా మహిళా కూలీలపై కర్రలతో, రాళ్లతో.. దాడి చేశారు. ఈ ఘర్షణలో మహిళా కూలీలతో పాటు.. రైతు సంఘం జిల్లా నాయకుడు మందా సైదులు, మరికొందరు గాయపడ్డారు. దుండగుల రాళ్లదాడిలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శంకర్ రావు, CITU జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహారావు, DYFI జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, SFI మధిర డివిజన్ కార్యదర్శి మధులు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు గ్రామాలలో జరగటం చాలా దురదృష్టకరమని రైతు సంఘం నేతలు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న కూలీలపై, నాయకుల పై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మే 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ..

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం

ముగ్గురు మూడు రకాలు.. పంచాయతీరాజ్ చట్టంపై క్లారిటీ లేని మంత్రులు