ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ ఇస్మాయిల్‌గూడలో శ్మశాన వాటిక ప్రహరీ కూల్చివేతతో ఉద్రిక్తత నెలకొంది. వసంత్ వ్యాలీ కాలనీలో శ్మశాన వాటిక ప్రహరీని మంగళవారం రాత్రి కూల్చివేయడంతో స్థానికులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. గోడ కూల్చిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఇస్మాయిల్‌గూడ వాసులు ఆరోపించారు. మహిళలను సైతం బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించి లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. 30 గజాల స్థలం విషయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో కూల్చివేతలు జరిగినట్లు తెలుస్తోంది.
