చందానగర్ లో గాంధీ విగ్రహం తొలగింపు ఘటనపై ఉద్రిక్తత

చందానగర్ లో గాంధీ విగ్రహం తొలగింపు ఘటనపై ఉద్రిక్తత

చందానగర్ లో గాంధీ విగ్రహం తొలగింపు ఘటనపై ఉద్రిక్తత నెలకొంది. విగ్రహం తోలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా చందానగర్ డివిజన్ లోని గాంధీ విగ్రహం వద్ద జయంతి వర్థంతి వేడుకలు జరుపుకునే వాళ్లమని వారు చెప్పారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలైనా ఇక్కడే చేసేవాళ్లమన్న స్థానికులు తెలిపారు. 

చందానగర్ డివిజన్ లో వంద కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ రావడం మంచిదే.. కానీ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, చందానగర్ వాసులకు ఎటువంటి సమాచారం లేకుండా గాంధీ విగ్రహం తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, నేషనల్ హైవే అధికారులపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారులు గాంధీ విగ్రహాన్ని మరో చోట ఏర్పాటు చేయాలని కోరారు. లేనిచో చందానగర్ లో పార్టీలకు అతీతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.