కామారెడ్డి మున్సిపాలిటీ దగ్గర భారీ బందోబస్తు

కామారెడ్డి మున్సిపాలిటీ దగ్గర భారీ బందోబస్తు

కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మున్సిపల్ ఆఫీస్ దగ్గర  ప్రజా దర్బార్ కు పెద్ద సంఖ్యలో TRS, బీజేపీ కార్యకర్తలు తరలిరావటంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీస్ స్టేషన్ దగ్గర రెండు పార్టీల కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్  ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అయితే ప్రజా దర్బార్ కు  అనుమతి లేదంటూ పోలీసులు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈక్రమంలోనే పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.

అంతకుముందు కామారెడ్డి బల్దియాలో అవినీతి,కబ్జాలు,అక్రమ భూదందాలపై బీజేపీ,టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సవాళ్లు, ప్రతిసవాళ్ళతో ప్రజా దర్బార్ పేరుతో బహిరంగ చర్చకు ఇరుపార్టీలు రెడీ అయ్యాయి. టీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెడతామని బీజేపీ ప్రకటించింది. దీంతో బీజేపీ సవాల్ ను TRS స్వీకరించింది. దీంతో రెండు పార్టీల నేతలు కామారెడ్డి మున్సిపాలిటీ దగ్గరకు వస్తుండటంతో... వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బందితో మున్సిపల్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం చేసినందుకు..