
దామరచర్ల, వెలుగు: స్కూల్ ప్రిన్సిపల్ మందలించారని ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించింది. నల్గొండ జిల్లా దామరచర్లలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న పదో తరగతి అమ్మాయి.. ప్రిన్సిపల్ స్ట్రిక్టుగా ప్రవర్తిస్తుండటంతో ఒత్తిడి భరించలేక సోమవారం ఎక్కువ మొత్తంలో ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. హుటాహుటిన స్కూల్ సిబ్బంది స్టూడెంట్ ను హాస్పిటల్ కు తరలించారు. ఆమెకు ఎంలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.
గురుకుల హాస్టల్ లో ఉంటున్న స్టూడెంట్ ను ఆదివారం సెలవురోజని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబీకులు.. తిరిగి సోమవారం స్కూల్ కు ఆలస్యంగా పంపించారు. దీంతో ప్రిన్సిపల్.. అమ్మాయిని నోటికొచ్చినట్లు తిట్టాడని, అది భరించలేకే సూసైడ్ అటెంప్ట్ చేసిందని స్టూడెంట్ కుటుంబీకులు చెబుతున్నారు. తమ బంధువులు చనిపోవడంతో అమ్మాయిని సోమవారం స్కూల్ కు పంపించడం ఆలస్యం అయిందని.. ఈ లోపే ప్రిన్సిపల్ నుంచి రెండు మూడు సార్లు ఫోన్ వచ్చిందన్నారు. ఈ విషయం ప్రిన్సిపల్కి తెలియజేసినా అమ్మాయిని దూషించడం దారుణమన్నారు. గతంలో చాలా సార్లు అమ్మాయిపై అనేక రకాల నిందలు వేశాడని చెబుతున్నారు. పలకరించేందుకు బంధువులు పాఠశాలకు వెళ్ళినా.. లేనిపోని నిందలు, సంబంధాలు అంటకట్టి మానసికంగా హింసించేవాడని వాపోయారు.
కావాలనే నాపై నిందలు
‘గురుకులాల నిబంధనల ప్రకారం పదో క్లాస్ స్టూ డెంట్లను ఇంటికి పంపాలంటే లెటర్ రాయించుకుని హౌజ్ టీచర్ పర్మిషన్ తో పంపిస్తాం. ఇంపార్టెంట్ క్లాసులు మిస్ అవుతారని.. సాధారణంగా ఇంటికి పంపిం చం. తిరిగి వెంటనే స్కూల్ కి పంపిస్తామని చెబితేనే అనుమతిస్తాం. స్టూడెంట్ సోమవారం లేట్ గా రావడానికి కారణాలు తెలుసుకుని క్లాస్ కు అనుమతిచ్చాను. పేరెంట్స్ వెళ్లిన కొద్దిసేపటికే అమ్మాయి ట్యాబ్లెట్లు తీసుకుంది . స్టూడెంట్స్ ను కన్నబిడ్డల్లా చూసుకుంటు న్నాం. పేరెంట్స్ కావాలనే నామీద ఆరోపణలు చేస్తున్నారు’ – ప్రిన్సిపల్