V6 News

ఇయ్యాల (ఏప్రిల్ 29) మధ్యాహ్నం టెన్త్ రిజల్ట్స్.. వాట్సాప్ లోనూ తెలుసుకునే అవకాశం

ఇయ్యాల (ఏప్రిల్ 29) మధ్యాహ్నం టెన్త్  రిజల్ట్స్.. వాట్సాప్ లోనూ తెలుసుకునే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ బిల్డింగ్ ఆవరణలో రిజల్ల్స్​ను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేయనున్నారు. 

 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగ్గా.. మొత్తం 5.28 వేల మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు. విద్యార్థులు తమ రిజల్ట్​ను https://results.bsetelangana.org,  https://bse.telangana.gov.in ,  https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లలో తెలుసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.

  • వాట్సప్ లో ఫలితాలు..

పదో తరగతి ఫలితాలను వాట్సప్ లోనూ పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఎస్ఎస్​సీ పరీక్షలకు అటెండ్ అయిన విద్యార్థులు ఇప్పుడు అధికారిక మీసేవా వాట్సప్ నంబర్  80969 58096 ద్వారా పొందవచ్చని చెప్పారు. ఆ నంబర్ కు హాయ్ అని మేసేజ్ చేసి, ఎస్ఎస్​సీ రిజల్ట్ అని టైప్ చేయాలి. మెనూలో ఓపెన్ సర్వీసెస్ ఎంపిక చేసుకొని, హాల్ టికెట్ నంబర్ ఇస్తే.. మార్కుల మెమో వస్తుంది.