హైదరాబాద్, వెలుగు: పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం రిలీజ్ కానున్నాయి. సాయంత్రం3 గంటలకు రిజల్ట్ ను https://bse.telangana.gov.in వెబ్ సైట్లో పెట్టనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. కాగా, ఈ నెల 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగ్గా, 51,237 మంది హాజరయ్యారు.
