ఫారిన్​ నుంచి మస్తు పైసలు

ఫారిన్​ నుంచి మస్తు పైసలు

ఫారిన్​ నుంచి మస్తు పైసలు
2022లో 100 బిలియన్​ డాలర్లు

న్యూఢిల్లీ : అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలోని హైలీస్కిల్డ్​ ఇండియన్​ ఇమిగ్రెంట్లు పోయిన సంవత్సరంలో మనదేశానికి వంద బిలియన్​ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ పంపించారని లండన్​ ఆధారిత మొబైల్​ పేమెంట్స్​సంస్థ టెరాపే వెల్లడించింది. విదేశాల నుంచి అత్యధికంగా డబ్బును స్వీకరించే దేశంగా భారతదేశం మొదటిస్థానంలో ఉందని కంపెనీ లెక్కలు చెబుతున్నాయి. ఖతార్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా,  అమెరికా నుండి ఇండియాకు భారీగా డబ్బు వస్తోంది. దాదాపు 1.8 కోట్ల భారతీయులు విదేశాల్లో పనిచేస్తున్నారని తెలిపింది.

2021తో పోలిస్తే 2022లో భారతదేశానికి రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌లు  12 శాతం పెరిగాయి. కరోనా కారణంగా 2021లో రెమిటెన్స్​లు కొంత తగ్గాయి. పోయిన సంవత్సరం నుంచి దీని ఎఫెక్ట్​ తగ్గడంతో చాలా మంది ఎన్​ఆర్​ఐలు తిరిగి విదేశాలకు వెళ్లారు. అధిక చమురు ధరల వల్ల గల్ఫ్​లోని భారత కార్మికుల ఆదాయం పెరిగింది. వారి కుటుంబాలకు మరింత డబ్బు పంపుతున్నారు. అమెరికా, యూకే,  ఆస్ట్రేలియాలో పనిచేసే ఇండియన్​ ప్రొఫెషనల్స్​ కరోనా సమయంలో జాబ్ సపోర్ట్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా వచ్చిన డబ్బును ఇంటికి పంపారు.  యూఎస్​ డాలర్‌‌‌‌‌‌‌‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వల్ల రెమిటెన్స్​ల​  విలువ పెరిగింది.