Dhanush : 'తేరే ఇష్క్ మే' మూవీ షూటింగ్ పూర్తి చేసిన ధనుష్

 Dhanush : 'తేరే ఇష్క్ మే' మూవీ షూటింగ్ పూర్తి చేసిన ధనుష్

ఇటీవల వచ్చిన ‘కుబేర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్.. మరోవైపు ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నాడు.  ‘తేరే ఇష్క్ మే’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్‌‌‌‌‌‌‌‌కు జంటగా కృతి సనన్ నటిస్తోంది.  ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో సెట్‌‌‌‌‌‌‌‌లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌‌‌‌‌‌‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆ సినిమాతో తనకున్న మెమొరీస్‌‌‌‌‌‌‌‌ను ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కృతిసనన్.  తాను ఇప్పటివరకూ కలిసి పనిచేసిన అత్యుత్తమమైన నటుల్లో ధనుష్  ఒకరని, తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ అందమైన జర్నీ ఎంతో స్పెషల్‌‌‌‌‌‌‌‌గా మిగిలిపోతుంది’ అని చెప్పింది.  ఇదొక రోలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌‌‌‌‌‌‌లా పూర్తయిందంటూ దర్శకుడుకి థ్యాంక్స్ చెప్పింది. ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ ఇంటెన్సిటీ కంటెంట్‌‌‌‌‌‌‌‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శంకర్ అనే పాత్రలో ధనుష్, ముక్తిగా కృతి సనన్ నటిస్తున్నారు. ఎ.ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.  దర్శకుడు ఆనంద్ ఎల్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో ధనుష్‌‌‌‌‌‌‌‌కు ఇది మూడో సినిమా. గతంలో రాంఝానా, అత్రంగి రే చిత్రాలకు వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేశారు.