
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) ఆధ్వర్యంలో శుక్రవారం రాంనగర్లోని రాజ్ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, టెస్కో వైస్ చైర్మన్ శైలజ రామయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. చేనేత కళాకారులకు ఉపాధి కల్పించేందుకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు రెండు నెలల పాటు జరిగే ఈ ప్రదర్శనలో పోచంపల్లి, ఇక్కత్, గద్వాల, నారాయణపేట, గొల్లభామ, సీకో, కాటన్ చీరలు 50 నుంచి 70 శాతం తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంటాయన్నారు. టెస్కో ఎండీ రఘునందన్ రావు, ఓఎస్‌డీ రతన్ కుమార్, యూనియన్ జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, ప్రెసిడెంట్ విజయ్ కుమార్, డివిజనల్ మార్కెటింగ్ అధికారి కళింగ రెడ్డి పాల్గొన్నారు.