16 లక్షల కోట్లు నష్టపోయిన మొదటి వ్యక్తి మస్క్‌‌‌‌

16 లక్షల కోట్లు నష్టపోయిన మొదటి వ్యక్తి మస్క్‌‌‌‌
  • 340 బిలియన్ డాలర్ల సంపద..137 బిలియన్ డాలర్లకు 

హైదరాబాద్‌‌, వెలుగు: కేవలం 13 నెలల్లోనే రూ.16.4 లక్షల కోట్ల (200 బిలియన్ డాలర్ల)  సంపద కోల్పోయిన వ్యక్తిని ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరు,  టెస్లా బాస్ ఎలన్ మస్క్ ఎంట్రీ ఇచ్చేంత వరకు.  చరిత్రలో ఈ ఫీట్ అందుకున్న వ్యక్తిగా మస్క్ రికార్డ్ క్రియేట్ చేశారు. సంపదలో  200 బిలియన్ డాలర్ల (రూ.16.4 లక్షల కోట్లు) మార్క్‌‌ను దాటిన రెండో వ్యక్తిగా 2021 ప్రారంభంలో  (అమెజాన్‌‌ జెఫ్ బెజోస్ తర్వాత)  రికార్డ్ క్రియేట్ సృష్టించిన ఆయన, ఆ తర్వాత కూడా  సంపద పెంచుకున్నారు. 

కిందటేడాది నవంబర్ నాటికి మస్క్ సంపద 340 బిలియన్ డాలర్ల (రూ.28 లక్షల కోట్ల) కు చేరుకుంది. అంటే అంబానీ సంపదను మూడు రెట్లు చేస్తే ఎంత ఉంటుందో అంతకు పెరిగింది. గ్లోబల్‌‌గా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు బాగోలేక, ఆయన స్వంత చర్యల వలనా  మస్క్ సంపద ఐస్‌‌క్రీమ్‌‌లా కరిగిపోయింది. 

ఒకప్పుడు ధనవంతుల లిస్టులో  నెంబర్ 2 కంటే 100 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్న ఆయన సంపద, ప్రస్తుతం నెంబర్ 1 బెర్నార్డ్‌‌ ఆర్నాల్ట్ కంటే 30 బిలియన్ డాలర్లు తక్కువ. టెస్లా షేర్లు 2022 లో 65 శాతం క్రాష్ అయ్యాయి. దీంతో ఎలన్ మస్క్ సంపద  ప్రస్తుతం137 బిలియన్ డాలర్లకు  పడిపోయింది.