మీకు నచ్చకపోతే ఇలాగా : ఆలూ, వంకాయ కర్రీ చెత్త కూర అంట

మీకు నచ్చకపోతే ఇలాగా : ఆలూ, వంకాయ కర్రీ చెత్త కూర అంట

వివాహ భోజనంబు.. ఎంతైనా వంటకంబు... పొటాటో.. బ్రింజెల్ మిక్స్  రెసిపీ ... హా..హా..హా... ఆలూ భైంగన్ కర్రీ ... హా..హా..హా.. అంటూ లొట్టలేస్తారు.  ఇంట్లో ఆరోజు బంగాళదుంప, వంకాయ, టమోటా, ఉల్లిపాయలు కలిపి కూర అంటే బ్రేక్​ ఫాస్ట్​ కూడా తీసుకోరు.. ఎందుకంటే లంచ్​ లో కాస్త ఎక్కువుగా లాగించచ్చు కదా... అని.. అయితే ప్రపంచ వ్యాప్తంగా చెత్త వంటకాల గురించి టేస్ట్ అట్లాస్ తయారు చేసిన జాబితాలో ఆలూ భైంగన్ కర్రీని చేర్చింది. 

ఎవరినైనా మీకు ఏ కూరగాయలు ఇష్టమంటే.. టక్కున బంగాళదుంప, వంకాయ  కర్రీలో  ఉల్లిపాయలు, టమాటా కలిపి వండితే నా సామిరంగా అంటూ లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.   ఇక ఎవరింట్లో అయిని తెల్ల వంకాయ.. గుత్తి వంకాయ రెసిపి అని మందే తెలిస్తే చాలు... సరిగ్గా భోజనం వేళకు ఆ ఇంటికి వెళ్లేందుకు కొంతమంది ప్లాన్​ వేసుకుంటారు.  ఒక్క బంగాళదుంపతో తప్పతే.... మిగతా ఏ కూరలోనైనా వంకాయను కలిపితే జనాలు అంతగా ఇష్టపడరు.  పొటాటో.. బ్రింజాల్​ కలిపి వండిన కూరను ఆలూ భైంగన్ కర్రీ అంటారు.  ఇది భారతీయులకు ఎంతో ఇష్టమైన ఫుడ్​ ... అయితే  ఇది ప్రపంచంలో చెత్త  ఆహారాల జాబితాలో నమోదైంది. 

ఆన్‌లైన్ ఫుడ్ పోర్టల్ టేస్ట్ అట్లాస్  ప్రతి ఏడాది ప్రపంచంలోని టాప్ 100 రకాలైన వరస్ట్​ ఫుడ్​  (చెత్త ఆహారాల) జాబితాను విడుదల చేస్తుంది.  మన దేశం నుంచి తక్కువ రేటింగ్స్ పొందిన ఆలూ భైంగన్ ఆ జాబితాలో చోటు సంపాదించింది. ఇది 100 వంటకాల్లో 60వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ కూరను బంగాళదుంప, వంకాయ, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చేస్తారు. ఇది ఒక గ్రేవీ వంటకం. దీన్ని ఇష్టపడేవారు మన భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నారు. అందుకే దీనికి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. దీన్ని ఎక్కువగా ఉత్తర భారత దేశంలోనే తింటూ ఉంటారు.

సర్వే ఎలా చేస్తారు...

ప్రపంచ వ్యాప్తంగా మీకు నచ్చని వంటకాన్ని, కూరను, ఏ ఆహారం నచ్చదో  టేస్టీ అట్లాస్ పోర్టల్‌ తెలపాలి.  ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా  ప్రజలు పాల్గొనవచ్చు. పోర్టల్​ లో  వచ్చిన  వివరాల పంరకారం  వరస్ట్​ ఫుడ్​ గా నిర్దేశించిన 100 రకాల ఫుడ్​ లను కలిపి నివేదిక తయారు చేస్తారు.   ఏ వంటకం బాగోదని ఎక్కువ మంది సూచిస్తారో వాటిని టాప్ 100 చెత్త వంటకాలలో ఎంపిక చేస్తారు. అలా మన దేశం నుంచి ఆలూ భైంగన్ ఈసారి  చెత్త వంటకాల్లో 60వ స్థానాన్ని  సంపాదించింది.

మెదటి స్థానం ఏ ఫుడ్​ అంటే....

అన్నింటికన్నా ప్రపంచంలో అత్యంత తక్కువ రేటింగ్ పొందిన ఆహారంగా హాకర్ల్ నిలిచింది. ఇది ఐస్లాండ్ కు చెందిన వంటకం. షార్క్ మాంసంతో మూడు నెలల పాటు దీన్ని పులియబెట్టి చేస్తారు. ఈ వంటకం చాలా ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. ఇది మొదటిసారి తింటే ఎవరికీ నచ్చదు. దీన్ని తినేవారి సంఖ్య కూడా చాలా తక్కువ. ఐస్లాండ్ లో ఉండే ప్రజలు దీన్ని ఇష్టంగా తింటారు. కానీ అక్కడికి వచ్చిన పర్యాటకులు మాత్రం ఈ ఆహారాన్ని తినలేరు. అందుకే ఇది అత్యంత చెత్త వంటకంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో అమెరికాకు చెందిన రామన్ బర్గర్ నిలిచింది. రామన్ నూడిల్స్ తో చేసే బర్గర్ ఇది. మధ్యలో మాంసాన్ని నింపి దీన్ని తయారు చేస్తారు. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే నచ్చుతుంది.