రేపే టెట్..  నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

రేపే టెట్..  నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ
  • నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ
  • సీసీ కెమెరాల మధ్య పేపర్ల ఓపెన్ 

హైదరాబాద్, వెలుగు : రేపు జరిగే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్​)కు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. చెప్పిన టైమ్​ కంటే నిమిషం ఆలస్యమైనా సెంటర్​లోకి అనుతించమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులను ఎగ్జామ్​ సెంటర్​లోకి అరగంట ముందే పంపిస్తామని తెలిపారు. ఆదివారం జరిగే టెట్​కు మొత్తం 3,80,589 మందికి గానూ శుక్రవారం సాయంత్రం నాటికి 3,61,205 మంది హాల్​టికెట్లను డౌన్​లోడ్ చేసుకున్నారు. పేపర్ 1 ఎగ్జామ్​ 1480 సెంటర్లలో నిర్వహిస్తుండగా.. 3,51,468 మంది, పేపర్ 2 ఎగ్జామ్ 1203 సెంటర్లలో జరుగుతుండగా.. 2,77,884 మంది రాయబోతున్నారు.

ఈ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 29,513 మంది ఇన్విజిలేటర్లను, 1480 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 1480 మంది డిపార్ట్​మెంట్ ఆఫీసర్లను, 252 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్​ను నియమించారు. అన్ని కేంద్రాల్లోని సీఎస్​ రూముల్లో సీసీ  కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడే పేపర్లను ఓపెన్​ చేసి ప్యాక్​ చేయాలని డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. సిబ్బందితో పాటు సెంటర్లలోని అధికారులూ సెల్​ఫోన్​ వాడకంపై నిషేధం విధించినట్టు టెట్ కన్వినర్​ రాధారెడ్డి చెప్పారు.

అభ్యర్థులు ముందుగానే సెంటర్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతీ స్టూడెంట్ రెండు బ్లాక్ బాల్ పెన్స్ తెచ్చుకోవాలని, ఓఎంఆర్ షీట్​లో సర్కిల్స్ పూర్తి షేడ్ చేయాలని సూచించారు.