ఎగ్జిబిటర్లు అమ్ముడు పోయిండ్రు: సి.కళ్యాణ్

ఎగ్జిబిటర్లు అమ్ముడు   పోయిండ్రు: సి.కళ్యాణ్

ఎగ్జిబిటర్లు అమ్ముడు పోయారన్నారు సి.కళ్యాణ్. ఓట్లు వేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఓటర్లు కరెక్టుగా ఓట్లు వేసి ఎన్నుకున్నారన్నారు.  ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుందని..దాని ద్వారానే ఫలితాలు ఆలస్యం అయ్యాయని చెప్పారు. తాను దిల్ రాజును సపోర్టు చేస్తున్నానని తెలిపారు.  ఫిల్మ్ ఛాంబర్ ట్రెజర్ గా తమ ఫ్యానెల్ అభ్యర్థి ప్రసన్నను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఘన విజయం సాధించింది.  మ్యాజిక్ ఫిగర్ 25 కాగా దిల్ రాజుకు 31 ఓట్లు వచ్చాయి.   దీంతో దిల్ రాజు ప్యానెల్ కు కీలక పోస్టులు దక్కాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామరాజు, సెక్రటరీగా దామోదర వరప్రసాద్, ట్రెజరర్ గా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనను బంపర్ మెజారిటీతో  గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు దిల్ రాజు. రేపటి నుంచే యాక్షన్ లోకి దిగుతామని చెప్పారు