TFCC Elections 2023: మొదలైన కౌంటింగ్.. ఉత్కంఠతో అభ్యర్థులు

TFCC Elections 2023: మొదలైన కౌంటింగ్.. ఉత్కంఠతో అభ్యర్థులు

మరికొద్దిసేపట్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ లో పాల్గొనడానికి సినీ ప్రముఖులు ఛాంబర్ కు చేరుకున్నారు. దాదాపు 1340 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో ప్రొడ్యూసర్ సెక్టార్ నుండి 891, స్టూడియో సెక్టార్ నుండి 68, డిస్ట్రిబ్యూషన్ నుండి నుంచి 380 ఓట్లు పోలయ్యాయి.

ప్రస్తుతం పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు ప్రకటించనున్నారు. దీంతో ఫలితాల కోసం సభ్యులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.