
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది దర్శకులు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh)ని కలిశారు. 2024 మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) పుట్టినరోజు సందర్బంగా..ప్రతీ సంవత్సరం ఆ రోజును డైరెక్టర్స్ డే గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ సంవత్సరం కూడా ఈ వేడుకలు ఘనంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇండస్ట్రీకి సంబందించిన ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి.
తాజాగా హీరో విక్టరీ వెంకటేష్‌కు కూడా టీఎఫ్‌డీఏ ఆహ్వానం అందించింది. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన వెంకటేష్ తప్పకుండా ఈవెంట్‌కు అటెండ్ అవుతానని హామీ ఇచ్చారు. అయితే, ఈ ఆహ్వానం ఇవ్వడానికి వెళ్లిన డైరెక్టర్స్ బృందంలో బేబీ ఫేమ్ సాయి రాజేశ్, విజయ్ కనకమేడల, శైలెష్ కోలనుతో పాటు పలువురు దర్శకులు వెంకటేష్‌ని కలిసిన వారిలో ఉన్నారు.కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా రావడానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తదితర స్టార్ హీరోలు కూడా ఆహ్వానం అందుకున్నారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ కు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లగా..ఈ వేడుక కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చాడట. ఇదే విషయాన్నీ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెల్లడించారు. మరోవైపు ఈ ఈవెంట్‌కు సంబంధించి బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైనట్లు టీఎఫ్‌డీఏ ప్రకటించింది.
Members of #TFDA Met VICTORY @venkymama Garu personally and Invited him for the “Directors’ Day” Event on May 4th at #LBStadium
— Vamsi Kaka (@vamsikaka) April 30, 2024
Book your tickets now on @bookmyshow - https://t.co/Dm30wW73Bp pic.twitter.com/YgZ5bMBMdb