హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఈనెల 22న చేపట్టనున్నారు. రెండో విడతలో విద్యార్థులు భారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ మొత్తం 36,032 మంది విద్యార్థులు తమ పాస్‌వర్డ్‌లను జనరేట్ చేసుకుని వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు.
వీరంతా కలిపి ఏకంగా 23,34,384 ఆప్షన్లను నమోదు చేయడం గమనార్హం. రికార్డు స్థాయిలో ఓ విద్యార్థి ఏకంగా 957 ఆప్షన్లను ఎంచుకున్నాడు. కాగా రెండో విడతలో కొత్తగా 2731 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో 2,675 మంది విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. కాగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు ఆదివారం అర్థరాత్రి వరకూ కొనసాగింది
