జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి

జాతీయ  స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి.. జాతీయ  స్థాయిలో సత్తా చాటారు.  రాచకొండ కమిషనరేట్ లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్( ఏఏఓ)గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్ కుమార్ జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో బంగారు పథకాన్ని సాధించారు. 

2024,  జూన్ 7  నుంచి 10వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించారు.  ఈ పోటీల్లో 83 కిలోల వెయిట్ క్యాటగిరీలో మొత్తం 170 కిలోల డెడ్ లిఫ్ట్ బరువును ఎత్తి ప్రథమ స్తానంతో పాటు బంగారు పథకం కైవసం చేసుకున్నారు.

ఈ సందర్బంగా రాచకొండ పోలిస్ కమిషనర్ తరుణ్ జోషి, ప్రదీప్ కుమార్ ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వయసులో కుడా ఇలా క్రీడలపై మక్కువతో అంచలంచెలుగా రాష్ట్ర,  జాతీయ, ప్రపంచస్థాయి పోటీలలో  ప్రదీప్ కుమార్ పాల్గొని తెలంగాణ పేరును ప్రపంచస్థాయిలో నిలబెట్టారని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.