ఇద్దరు హీరోయిన్లతో మాస్ డ్యాన్స్.. వామ్మో వాయ్యో అంటున్న రవితేజ

ఇద్దరు హీరోయిన్లతో మాస్ డ్యాన్స్.. వామ్మో వాయ్యో  అంటున్న రవితేజ

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.  ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్.  సుధాకర్ చెరుకూరి నిర్మించారు.  శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘వామ్మో వాయ్యో’ అనే పాటను విడుదల చేయబోతున్నారు.  ఇందుకోసం వరంగల్​లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. 

సాంగ్‌ ప్రోమోను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్​మెంట్‌ పోస్టర్‌‌లో రవితేజతో పాటు హీరోయిన్స్‌ ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కలర్‌‌ఫుల్‌ అవుట్‌ ఫిట్స్​లో కనిపించారు.  ఇక సాంగ్ ప్రోమోలో రవితేజ మార్క్‌ మాస్‌ ఎనర్జీతో పాటు హీరోయిన్స్‌ గ్రేస్‌ఫుల్‌ డాన్స్‌ మూమెంట్స్‌ ఆకట్టుకున్నాయి.

 భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రాఫర్.  సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది.