తెలంగాణ అభివృద్ధికి యూత్ మిషన్ అనివార్యం

తెలంగాణ అభివృద్ధికి యూత్ మిషన్ అనివార్యం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా యువతే ప్రధాన శక్తి. రాష్ట్ర మొత్తం జనాభాలో యువత శాతం అత్యధికంగా ఉండటం వల్ల యువజన శక్తిని సరైన దారిలో వినియోగిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది అనే దృష్టితో నూతన యువజన విధానాన్ని ప్రభుత్వం  రూపొందించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ– పట్టణ ప్రాంతాల మధ్య అభివృద్ధి అంతరాలను తగ్గించడం, ఉద్యోగ–స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించడం, క్రీడలు–కళలను ప్రోత్సహించడం, ఆరోగ్యం–మనోవికాసం మెరుగుపరచడం, సామాజిక బాధ్యతను పెంపొందించడం ఈ విధాన ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి.

ప్రతి యువకుడు విద్యావంతుడు, నైపుణ్యవంతుడు, ఆరోగ్యవంతుడు, బాధ్యతగల పౌరుడిగా ఎదగాలి. సమాజం, పరిశ్రమ, సేవారంగం, డిజిటల్ రంగాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచి తెలంగాణను యువశక్తితో ముందుకు నడిపించాలి. గ్రామీణ యువత కోసం ప్రత్యేక చర్యలు గ్రామీణ స్కిల్ హబ్‌‌‌‌లు ప్రతి మండలంలో నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేసి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, డెయిరీ, పౌల్ట్రీ, మత్స్యరంగం, హస్తకళలు, గ్రామీణ ఉత్పత్తులు, గ్రామీణ టూరిజం లాంటివి ప్రోత్సహించాలి. 

యువ రైతుల సాధికారత స్మార్ట్ ఫార్మింగ్, డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై శిక్షణ, పంటల మార్కెటింగ్, విలువ ఆధారిత ప్రాసెసింగ్ రైతు స్టార్టప్‌‌‌‌లకు పన్ను రాయితీలు రైతు ఉత్పత్తుల మార్కెట్ యాప్ ద్వారా డిజిటల్ విక్రయాలను ప్రోత్సహించాలి. 

గ్రామీణ స్టార్టప్‌‌‌‌లకు ప్రోత్సాహం ఇవ్వాలి
గ్రామీణ యువత వ్యాపారం ప్రారంభిస్తే వడ్డీరహిత రుణాలు, మార్గదర్శకత్వం, మహిళా యువత కోసం ప్రత్యేక ఫండ్ అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పట్టణ యువత కోసం పట్టణ యూత్ ఎంపవర్‌‌‌‌మెంట్ మిషన్ పట్టణ బస్తీలలో నివసించే యువకుల కోసం డిజిటల్ స్కిల్స్, ఉద్యోగ గైడెన్స్, కార్పొరేట్ ట్రైనింగ్ అందించే సెంటర్లను ఏర్పాటు చేయాలి. 

ఐటీ–ఇండస్ట్రీ ఆధారిత శిక్షణ కోడింగ్ బూట్‌‌‌‌క్యాంప్‌‌‌‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ శిక్షణ, పరిశ్రమ–విద్యా భాగస్వామ్యం ద్వారా ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌లు కల్పించాలి. స్టార్టప్, ఇన్నోవేషన్ ప్రోత్సాహం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్  వంటి నగరాల్లో “యూత్ ఇన్నోవేషన్ సెంటర్లు” ప్రారంభించి యువతకు వ్యాపార మార్గదర్శకత అందించాలి.

విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు
ప్రతి కాలేజీలోయూత్​  డెవలప్‌‌‌‌మెంట్ క్లబ్‌‌‌‌లు  ఏర్పాటు చేసి ఈ క్లబ్‌‌‌‌ల ద్వారా  విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ లీడర్‌‌‌‌షిప్ ట్రైనింగ్ అందించాలి. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ (యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువత నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  కృషిని తెలంగాణ యువత స్వాగతిస్తున్నది. అలాగే ఉపాధి–స్వయం ఉపాధి మార్గదర్శక కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యోగ సమాచారం, ఇంటర్వ్యూ శిక్షణ, అప్పు–పథకాలపై మార్గదర్శకత అందించే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 

యువత మనోవికాసం, క్రీడలు మనోవికాస సేవలు,  వార్షిక మానసిక ఆరోగ్య క్యాంపులు, యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలి.  క్రీడల అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియంలు, గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం, క్రీడా స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లు అందించాలి.  డ్రగ్స్–సైబర్ క్రైమ్ అవగాహన స్కూళ్లు–కాలేజీల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు.

నాయకత్వ లక్షణాలను పెంచాలి
సామాజిక భాగస్వామ్యం రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో యువజన సంఘాలను ఏర్పాటు చేసి గ్రామాభివృద్దిలో బాగస్వామ్యం కల్పించాలి.   తెలంగాణ యూత్ పార్లమెంట్ ప్రతి జిల్లాలో యువత ద్వారా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగల పాలనలో పాల్గొనగల సంస్కరణాత్మక వేదికలు ఏర్పాటు చేయాలి. 

సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, హరితహారం, మహిళా రక్షణ, బాలల హక్కుల పరిరక్షణలో యువతను ప్రధాన శక్తిగా తీర్చిదిద్దడం చాలా అవసరం. యువత కోసం సమగ్ర  తెలంగాణ యూత్ మిషన్ ద్వారా నైపుణ్యాలు, ఉపాధి, ఆరోగ్యం, క్రీడలు, నాయకత్వం, సామాజిక సేవలు అనే ఆరు రంగాల్లో ఒకే వేదిక ద్వారా సేవలు అందించాలి.

అభివృద్ధిలో యువత భాగస్వామ్యం
గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు అందించినప్పుడే తెలంగాణ యొక్క భవిష్యత్ మరింత బలపడుతుంది. ఈ నూతన యువజన విధానం యువతను సామాజికంగా చైతన్యవంతులుగా, ఆర్థికంగా బలమైన వారుగా, దేశనిర్మాణంలో కీలక పాత్ర పోషించగల నాయకులుగా తీర్చిదిద్దుతుంది. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర స్థాయిలో  ‘తెలంగాణ యూత్ మిషన్’ ను ఏర్పాటు చేసి పట్టణ, గ్రామీణ యువకుల్ని  రాష్ట్రాభివృద్దిలో భాగస్వామ్యం చేయాలి. తెలంగాణను యువత ఆధారిత శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తెలంగాణ యూత్ మిషన్ లక్ష్యంగా ఉండాలి. 

మండల పరశురాములు, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత