తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా విద్యాసంస్కరణలు : ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి

తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా విద్యాసంస్కరణలు : ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి
  •     గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి నివేదిక అందజేత

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్​లో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ సాధన దిశగా కీలక సంస్కరణలు చేపట్టామని తెలంగాణ  హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన లోక్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన  వీసీల సమావేశంలో  రాష్ట్ర గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మండలి కార్యకలాపాలపై సమగ్ర నివేదికను అందజేశారు. 

జాతీయ విద్యా విధానం గైడ్ లైన్స్​కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగాడిగ్రీ సిలబస్​ను మార్చినట్టు బాలకిష్టారెడ్డి తెలిపారు. టీజీ సెట్స్ నిర్వహణలో పారదర్శకత, దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియను బలోపేతం చేయడం వంటి అంశాలను గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నివేదించారు. కీలక విధానపరమైన అంశాలపై నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధనలు, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

స్పైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘ఉన్నతి’ పెంచాలి : వీసీలకు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచన 

రాష్ట్రంలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రచారంలోకి తేవాలని రాష్ట్ర గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ తెలిపారు. సొసైటీ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమాంగెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (స్పైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాకీ) కార్యక్రమంలో భాగంగా యువతలో సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచడం వల్ల ప్రయోజనాలను అధికారులకు వివరించారు.