- టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
నిర్మల్, వెలుగు: విద్యుత్ సరఫరాలో ట్రిప్పింగ్‌లను తగ్గించేందుకు నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నామని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్జిల్లాలోని కడెం, ఖానాపూర్, నిర్మల్ ప్రాంతాల్లోని స్టేషన్లు, విద్యుత్ సరఫరా, పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. కడెం, ఖానాపూర్ లోని సబ్ స్టేషన్లను, వర్షాల వల్ల దెబ్బతిన్న లైన్ల ప్రాంతాలను సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారు.
అనంతరం జిల్లా కేంద్రంలో అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన హెచ్‌టీ, ఎల్‌టీ లైన్ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని 11 కేవీ ఫీడర్లపై లైటెనింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
