- ఈ నెల30 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ ఏఈఈ (సివిల్), ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్ (జేఈ) రాత పరీక్షలు రెండూ నవంబర్ 6న ఉన్న అభ్యర్థులకు ఏఈఈ ఎగ్జామ్‌ను నవంబర్ 7వ తేదీన నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. అభ్యర్థులు రెండు పరీక్షలకూ హాజరయ్యేలా వెసులుబాటు కల్పిస్తూ.. అవకాశం ఉన్నంత మేరకు బాధిత అభ్యర్థుల పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేస్తామని టీజీపీఎస్సీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
వివరాలు సమర్పించాలన్న కమిషన్
మరో తేదీన పరీక్ష రాయలనుకునే అభ్యర్థులు తమ వివరాలను కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 6న ఎగ్జామ్ ఉన్నట్టు తెలిపే ఎస్ఎస్సీ జేఈ హాల్ టికెట్ కాపీ, టీజీపీఎస్సీ ఏఈఈ దరఖాస్తు కాపీతో పాటు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఐడీ వివరాలను w కమిషన్ సూచించింది. ఈ పత్రాలను ఈ నెల30న సాయంత్రం 5:00 గంటల్లోపు టీజీపీఎస్సీ ఆఫీస్ హెల్ప్ డెస్క్‌లో నేరుగా గానీ లేదా [email protected] ఈ-మెయిల్ ద్వారా గానీ పంపించాలని పేర్కొంది.
గడువులోగా వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, పరీక్ష ఏర్పాట్లకు అనుగుణంగా నవంబర్ 7న వారికి పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ సమస్యపై ఈ నెల 9న ‘నేషనల్ ఎగ్జామ్స్ రోజే టీజీపీఎస్సీ పరీక్షలు’ శీర్షికతో ‘వీ6 వెలుగు’ కథనం ప్రచురించినా మొదట్లో అధికారులు పట్టించుకోలేదు. చివరకు అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో దిగొచ్చిన కమిషన్.. చేసేదేవీ లేక పరీక్ష తేదీని మారుస్తూ ప్రకటన విడుదల చేసింది.
