
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2025–26 విద్యాసంవత్సరానికి గానూ అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీఆర్జేసీ –2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణ కుమార్ మాట్లాడుతూ..ఈ నెల 10 న నిర్వహించిన పరీక్షకు 61,476 మంది అటెండ్ అయ్యారని తెలిపారు.
ఫలితాలను గ్రూపుల వారీగా, మార్కులు, ర్యాంకుల లిస్టులను http://tgrjc.cgg.gov.in వెబ్ సైట్లో పెట్టినట్టు చెప్పారు. మెరిట్, రిజర్వేషన్ల ద్వారా ఎంపికైన లిస్టులను జూనియర్ కాలేజీలలో.. అడ్మిషన్ల డేటాను స్టూడెంట్ల సెల్ ఫోన్లకు ఈ నెల 24న పంపిస్తామని పేర్కొన్నారు.