పండుగ పూట ఇదేం వికృతానందం. .ఎటు వెళ్తోందీ సమాజం: సజ్జనార్

 పండుగ పూట ఇదేం వికృతానందం. .ఎటు వెళ్తోందీ సమాజం: సజ్జనార్

హైదరాబాద్లో బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న యువకులపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం అంటూ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినమని అన్నారు. అయితే పండుగ నాడు  కొందరు యువకులు  వెర్రి వేషాలు వేస్తూ..  అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 

నవంబర్ 2న  రాత్రి  ఐటీ కారిడార్ రాయదుర్గంలో  కొందరు యువకులు బైక్ రేసింగ్ లతో బీభత్సం సృష్టించారు. బైకులపై పటాకులు కాలుస్తూ రచ్చరచ్చ చేశారు.  రోడ్లపై  ప్రమాదకర స్టంట్స్  చేస్తూ  హంగామా చేశారు. బైక్ రెసింగ్ లకు పాల్పడిన 26 మంది యువకులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలను తన ఎక్స్ లో పోస్ట్ చేసిన సజ్జనార్ యువకుల తీరుపై అవేదన వ్యక్తం చేశారు. పండగ పూట ఇదేం వికృతానందం..సమాజం ఎటుపోతుందంటూ సీరియస్ అయ్యారు.