
బషీర్‌బాగ్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా రంగారెడ్డి రీజియన్ పరిధిలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపల్ లగ్జరీ, లహరి తదితర ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి లక్కీ డ్రా నిర్వహించారు. బుధవారం ఎంజీబీఎస్‌లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి గెస్ట్‌గా హాజరై డ్రా తీశారు. సెప్టెంబర్ 30న నిజామాబాద్ నుంచి జేబీఎస్ వరకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణించిన నమియాకు ప్రథమ స్థానం, ఈ నెల 6న సూర్యాపేట నుంచి దిల్ సుఖ్ నగర్ వరకు డీలక్స్ బస్సులో ప్రయాణించిన జె.శారద ద్వితీయ స్థానం, ఈ నెల 3న నిజామాబాద్ నుంచి జేబీఎస్ వరకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణించిన ఆజార్ తృతీయ బహుమతికి ఎంపికయ్యారు. వీరికి రూ.25 వేలు, రూ.15 వేల, రూ.10 వేల నగదు బహుమతులను త్వరలో అందజేస్తామని రంగారెడ్డి రీజనల్ మేనేజన్ జె.శ్రీలత తెలిపారు. డిప్యూటీ ఆర్ఎం సరస్వతి, సీఆర్ఎం సుఖేందర్ రెడ్డి, సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్య, అఫ్టల్ గంజ్ ఇన్స్పెక్టర్ రవినాయక్ పాల్గొన్నారు.