Best of Luck: టెన్త్​ స్టూడెంట్లకు స్పెషల్ బస్సులు

Best of Luck: టెన్త్​ స్టూడెంట్లకు స్పెషల్ బస్సులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: టెన్త్​క్లాస్​ఎగ్జామ్స్ నేపథ్యంలో శుక్రవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రూట్ పాస్ ఉన్న విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఏ రూట్లలోనైనా ప్రయాణించవచ్చన్నారు. 

విద్యార్థినులు హాల్ టికెట్ చూపించి ఫ్రీగా జర్నీ చేయవచ్చన్నారు. పాస్ లేని స్టూడెంట్లకు నార్మల్ ఫేర్ తో టికెట్ఇష్యూ చేస్తామన్నారు. అన్ని బస్టాపుల్లో సూపర్​వైజర్లు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారని, వివరాలకు కోఠి బస్ స్టేషన్: 9959226160, రేతిఫైల్ స్టేషన్: 9959226154 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.