టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో ఫేక్.. ఇంకా యాజమాన్యం ఫైనల్ చేయలేదు : సజ్జనార్

టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో ఫేక్.. ఇంకా యాజమాన్యం ఫైనల్ చేయలేదు : సజ్జనార్

టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీ  కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌ అని వెల్లడించారు. ఎక్స్ వేదికగా ఆ వార్తను కొట్టిపాడేశారు.

 ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని సజ్జానర్ తెలిపారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని చెప్పారు. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని వెల్లడించారు టీజీఎస్ ఆర్టీసీ  ఎండీ సజ్జనార్. మరోవైపు టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఇదే అని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి. వాటిపై నెటిజన్స్ స్పందిస్తూ టీజీఎస్ అనేది ఓ ఎమోషన్ అని కామెంట్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ నూతన లోగో అది కాదని చెప్పడంతో నెటిజన్స్ అయోమయానికి గురయ్యారు. నూతన లోగోను తొందరగా విడుదల చేయాలని కోరారు.