TGTET బిగ్ అప్డేట్.. టెట్ హాల్ టికెట్లపై విద్యా శాఖ కీలక ప్రకటన

TGTET బిగ్ అప్డేట్.. టెట్ హాల్ టికెట్లపై విద్యా శాఖ కీలక ప్రకటన

హైదరాబాద్: TGTET గురించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. రేపటి (మంగళవారం) నుంచి టెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. జూన్ 16-22 మధ్య టెట్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాల్లో టెట్ పరీక్షలు జరుగుతాయి.

ఉదయం 9 నుంచి 11:30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయత్రం 4:30 రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సంఖ్య, వారు ఎంచుకున్న సబ్జెక్టుల ఆధారంగా జిల్లాల వారీగా ఈ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు.

రోజుకు రెండు సెషన్లు.. పరీక్షలను ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. సెషన్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటుంది. పరీక్షా కేంద్రాలు, జిల్లాల వారీగా కేటాయింపులకు సంబంధించి పూర్తి వివరాలు https://schooledu.telangana.gov.inలో చూసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 22న జరిగే మైనర్ లాంగ్వేజ్ పరీక్షలు అన్ని జిల్లాల అభ్యర్థులకు కలిపి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

పేపర్ల వారీగా షెడ్యూల్ ఇలా..

  • జూన్ 16: మొదటి, రెండో సెషన్లలో పేపర్-1 (ఇంగ్లీష్/తెలుగు మీడియం) 
  • జూన్ 17: ఉదయం పేపర్-1, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్-2 (మ్యాథ్స్ అండ్ సైన్స్) 
  • జూన్ 18: రెండు సెషన్లలోనూ పేపర్-2 (మ్యాథ్స్ అండ్ సైన్స్) 
  • జూన్ 19: రెండు సెషన్లలో పేపర్-2 (సోషల్ స్టడీస్) 
  • జూన్ 22: ఉదయం మైనర్ లాంగ్వేజెస్ (హిందీ, ఉర్దూ, కన్నడ తదితర) వారికి పేపర్-2, మధ్యాహ్నం మైనర్ లాంగ్వేజ్ అభ్యర్థులకు పేపర్-1