RajiniKamal: రజినీకాంత్ - కమల్ హాసన్ కాంబోలో మెగా ప్రాజెక్ట్.. 'తలైవా 173'తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

RajiniKamal: రజినీకాంత్ - కమల్ హాసన్ కాంబోలో మెగా ప్రాజెక్ట్.. 'తలైవా 173'తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

దశాబ్దాలుగా దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఏలుతున్న లెంజెండరీ నటులు సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్.  ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని కమల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ అపూర్వ కలయిక కేవలం ఒక సినిమా ప్రకటన మాత్రమే కాదు. ఐదు దశాబ్దాల స్నేహబంధానికి , సోదరభావానికి నిదర్శమంటూ ఒక భావోద్వేగ నోట్ లో స్పష్టం చేశారు . దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సహం నెలకొంది.

ఒకరు హీరో.. మరొకరు నిర్మాత!

తన నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పతాకంపై  హీరోగా నా డియర్ ఫ్రెండ్ రజినీకాంత్ తో సినిమాను నిర్మిస్తున్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. గాలిలా, వర్షంలా, నదిలా, వర్షంలా కురుద్దాం.. ఎంజాయ్ చేద్దాం.. జీవిద్దాం.. అని పోస్ట్ చేశారు. ఈ సినిమాకు హాస్యాన్ని పండించడంలో దిట్ట అయిన దర్శకుడు సుందర్. సి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా 'తలైవా 173' అని పేరు పెట్టారు. ఈ  ప్రాజెక్ట్ 2027 పొంగల్ సందర్భంగా విడుదల కానుందని వెల్లడించారు.

 బ్లాక్ బస్టర్ హిట్ పక్కా..

కమల్ హాసన్ షేర్ చేసిన ఈ నోట్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కలయిక భారతీయ సినిమాలోని రెండు అగ్రశక్తులను ఏకం చేయడమే కాక, సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ మధ్య ఉన్న ఐదు దశాబ్దాల స్నేహం, సోదరభావాన్ని కూడా చాటి చెబుతోంది. ఈ బంధం తరతరాల కళాకారులు, ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, సుందర్. సి ,  రజినీకాంత్ కాంబినేషన్ దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటవడం మరో విశేషం. వీరిద్దరూ కలిసి చివరిసారిగా 1997లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అరుణాచలం' చిత్రానికి పనిచేశారు. 

 

ఆనందంతో అభిమానులు

ఈ ప్రకటన సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. రజినీకాంత్, కమల్ హాసన్, సుందర్. సి ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "నా హీరోలు ఒకే ఫ్రేమ్‌లో!! మాటలకు అందని ఉత్సాహం అని పోస్ట్ చేశారు. అభిమానులు కూడా ఈ ఐకానిక్ కలయిక పట్ల అనందం వ్యక్తం చేశారు.  రజినీకాంత్ - కమల్ కాంబో 1970ల నుండి బలంగా ఉంది అని పోస్ట్ చేశారు.  మరొకరు అరుణాచలం తర్వాత, ఈ కాంబో పరిశ్రమకు మరో బంపర్ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుంది అని అన్నారు. రజినీ, కమల్ మరియు సుందర్. సి లకు మూడు చీయర్స్! 2027 పొంగల్ కోసం ఎదురుచూస్తున్నాం!" అంటూ తమ ఉత్సాహాన్ని చూపించారు.

'కూలీ' సినిమా విడుదల కంటే ముందే రజినీకాంత్, కమల్ హాసన్ చాలా కాలంగా తమ కలయిక గురించి సూచనలిస్తూనే ఉన్నారు. ఇక కమల్ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'థగ్ లైఫ్' చిత్రాన్ని పూర్తి చేశారు. రజినీకాంత్ సైతం ప్రస్తుతం 'జైలర్ 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 'తలైవా 173'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రకటన అభిమానులను ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.