లియో ట్రైలర్ పాసయిందా?

లియో ట్రైలర్ పాసయిందా?

సితార సంస్థ భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేయడంతో లియో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.  ఇటవల విడుదల చేసిన  ట్రైలర్ లో కథకు సంబంధించిన కీలక క్లూస్ ఇచ్చారు. నడిరోడ్డు మీద అమాయకులను కిరాతకంగా చంపే సైకో కిల్లర్ ని ఎదిరిస్తాడో పోలీస్ ఆఫీసర్(గౌతమ్ మీనన్). ఆయనతో సంబంధం ఉన్న ఓ యువకుడు(విజయ్) ఆ సంఘటనను వదిలేసి భార్య(త్రిష)తో దూరంగా వెళ్లిపోయి బతుకుతూ ఉంటాడు. ఇతన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఇద్దరు దుర్మార్గులు(సంజయ్ దత్-,అర్జున్)వెతికి మరీ కుటుంబాన్ని వేధించడం మొదలుపెడతారు. అయితే అచ్చం తనలాగే ఉండే లియో(విజయ్)వల్ల ఇదంతా జరుగుతోందని తెలుసుకుని అతను ఎదురు తిరుగుతాడు. అక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. 

విజువల్స్ అన్నీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టైల్ లో ఉన్నాయి. విజయ్ డ్యూయల్ రోల్ అనే సంకేతం స్పష్టంగానే ఇచ్చారు. రెండు షేడ్స్ ని రివిల్ చేసేయడంతో పెద్దగా సస్పెన్స్ లేదు. అనిరుద్ రవిచందర్ సంగీతం అతని పంథాలోనే సాగింది. విక్రమ్ ని మించి డెప్త్, యాక్షన్, వయొలెన్స్  చిత్రంలో కనిపిస్తుంది.  ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చే ప్రయత్నం గట్టిగానే చేశారు. అక్టోబర్ 19న భారీ అంచనాలతో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, గణపథ్ లతో పోటీ పడబోతున్న లియో ట్రైలర్ పరీక్షలో మాత్రం మంచి మార్కులతో పాసయ్యాడనే టాక్ వినిపిస్తోంది.