ఐటీ రైడ్స్ తర్వాత కూడా అదే జోష్.. గర్వంగా ఫీలవుతున్న విజయ్ ఫ్యాన్స్

ఐటీ రైడ్స్ తర్వాత కూడా అదే జోష్.. గర్వంగా ఫీలవుతున్న విజయ్ ఫ్యాన్స్

తమిళ నటుడు దళపతి విజయ్‌ ఆస్తులపై కొన్ని రోజుల క్రితం ఐటీ అధికారులు దాడులు జరిపారు. అయితే ఐటీ రైడ్స్ తర్వాత కూడా విజయ్ ఎప్పటిలానే షూటింగ్ కు హాజరవుతున్నాడు. అతని తాజా చిత్రం మాస్టర్ కు సంబంధించి తమిళనాడులోని నైవేలీ ప్రాంత గనుల్లో షూటింగ్ జరుగుతోంది.

అయితే  తమ అభిమాన హీరో  తమ ప్రాంతంలో షూటింగ్ కు హాజరవుతున్నారని తెలిసి  విజయ్ అభిమానులు ఆయన్ను చూడ్డానికి వస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వందలాది మంది  అభిమానులు ఆయన్ను పలకరించేందుకు స్పాట్ కు వచ్చి గ్రాండ్ వెలకమ్ చెబుతున్నారు. అయితే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. విజయ్ తన జోష్ ను కొనసాగిస్తున్నాడు. తన కోసం వస్తున్న అభిమానులను చిరునవ్వుతో, పాజిటివ్ ఎనర్జీతో పలకరిస్తున్నాడు. ఇది చూసి వారంతా గర్వంగా ఫీలవుతున్నారు.

ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఎక్స్ బీ ఫిలిమ్ క్రియేషన్స్ నిర్మాణంలో వేసవి కానుకగా ఏప్రిల్ 9న ఈ మూవీ విడుదల కానుంది.