
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) మొదటిసారి పోలీస్ అధికారిగా చేసిన వెబ్ సిరీస్ ఆఖరి సచ్ (Aakhri Sach Web Series). ఆగస్టు 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disney plus hotstar) స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. ఢిల్లీలో 2018లో జరిగిన బురారీ ఫ్యామిలీ హత్యల నేపథ్యంలో తెరకెక్కింది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్స్ రిలీజ్ కానున్న ఈ సిరీస్ నుండి రెండు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? పోలీస్ అధికారిగా తమన్నా ఏమేరకు మెప్పించింది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ: దేశ రాజధాని ఢిల్లీలోని కిషన్ నగర్ కు చెందిన ఓ ఫ్యామిలీలో 11 మంది చనిపోతారు. ఆ కేసును విచారణ కోసం అన్యా (తమన్నా భాటియా) రంగంలోకి దిగుతుంది. ఇక చనిపోయిన 11 మందిలో ముసలావిడ చనిపోయే ముందు బతకడానికి ప్రయత్నించడం, మిగతా సభ్యుల కళ్ళకు గంతలు & చేతులు కట్టేసి ఉండటం, ఉరివేసుకున్న చోటుకి కుర్చీలకి మధ్య దూరం ఉండటంతో అన్యాకు అనుమానం వస్తుంది. దాంతో ఆ మరణాల ఆత్మహత్యలా? లేక వారిని ఎవరైనా చంపేశారా? ఈ కేసు దర్యాప్తులో అన్యా ఏం తెలుసుకుంది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: ఢిల్లీలోని బురారీ కుటుంబ సభ్యుల మరణం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ మరణాలపై చాలా రకాల కథనాలు వినిపించాయి. ఈ మరణాలపై తీసిన వెబ్ సిరీసే ఆఖరి సచ్. అందుకే ఆడియన్స్ కు ఈ సిరీస్ పై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ఆడియన్స్ కు ఏమాత్రం బోర్ కొట్టించకుండా డైరెక్ట్ కథలోకి వెళ్లాడు. కానీ కథనం ముందుకు సాగె కొద్దీ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్, మరానాలపై టీవీ డిబేట్స్, న్యాయం కోసం ప్రజల పోరాటం చేయడం వంటివి చూపించి కాస్త విసుగు తెప్పించాడు. రెండు ఎపిసోడ్స్ లలో కేవలం ఒక్క శివిన్ నారంగ్ పాత్ర తప్పా పెద్దగా క్యూరియాసిటీని పెంచిన పాయింట్ ఒక్కటికూడా లేదు.
సాంకేతిక నిపుణులు: ఈ సిరీస్ లో టెక్నికల్ అంశాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కెమెరా వర్క్, ఎడిటింగ్,మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగా సెట్ అయ్యాయి. వీటి వాళ్ళ సిరీస్ చాలా రిచ్ గా, సహజంగా కనిపించింది.
నటీనటులు: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే తమన్నా కొంతకాలంగా వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తోంది. అలా వచ్చినవే జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2. కానీ ఈ రెండు సిరీస్లకు పూర్తి భిన్నంగా ఆఖరి సచ్ లో కనిపించింది తమన్నా. చాలా సీరియస్ అండ్ ఇంటెన్స్ పాత్రలో కనిపించి మెప్పించింది తమన్నా. పాత్రకు అన్యా పాత్రకు కూడా ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక రిలీజైన రెండు ఎపిసోడ్లలో అభిషేక్ బెనర్జీ పాత్ర ఉన్నది కాసేపే అయినప్పటికీ.. చాలా బాగా చేశారు. ఇక శివిన్ నారంగ్ పాత్ర ఎంటర్ ఐన తరువాత ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక మిగిలిన నటులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పోలీస్ అధికారిగా తమన్నా సూపర్.. కానీ సిరీస్ గురించి చెప్పాలంటే మిగతా ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అవ్వాలి. ఇప్పటివరకైతే సో సో గానే ఉంది.