మరో బలగం మూవీ .. తమిళ సూపర్ హిట్ తండట్టి.. ఓటీటీ లో స్ట్రీమింగ్

మరో బలగం మూవీ .. తమిళ సూపర్ హిట్ తండట్టి.. ఓటీటీ లో స్ట్రీమింగ్

ఏదైనా కష్టం వచ్చినపుడు ఒక తోడు కావాలి. వెంట నడిచే బలగం కావాలి. ఎందుకంటే,ఒక పదిలమైన ఇల్లు కట్టుకుంటేనే, ఆ ఇంటి గురించి పది తరాలు చెప్పుకున్నప్పుడు..అదే ఇంట్లో అందరం ఒక్కటిగా  కలిసి ఉంటే ఇక ఎలా ఉంటుందో..ఆలోచించండి. అంతటి ఆలోచనని..భావోద్వేగాన్ని.. బలగం మూవీ ద్వారా అందరికీ అర్థమయ్యేలా చేశాడు డైరెక్టర్ వెల్డండి వేణు(Venu Yeldandi).

లేటెస్ట్ తమిళ సూపర్ హిట్  'తండట్టి' (Thandatti)  మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. చావు నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రతి ప్రేక్షకుడిని కంట తడి పెట్టిస్తుంది. డైరెక్టర్ కథలో నవ్వులు పంచుతూనే..మానవీయ విలువలను తనదైన శైలిలో చూపించారు. చిన్న పల్లెటూరి నేపథ్యంలో సాగే బంధాలు.. దాని వెనుక దాగున్న ఆర్థిక సంబంధాలను.. ఆస్తి కోసం ఆరాట పడుతూ.. పిల్లలు కన్నవారిపై చూపించే కపట ప్రేమను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో డైరెక్టర్ రామ్ సంగయ్య సక్సెస్ అయ్యారు. 

తండట్టి మూవీలో కామెడీ, లవ్,ఎమోషన్ అన్నీ చూపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే అందరికీ కనెక్ట్ అవుతుంది. మనిషి కట్టే కాలేటపుడు కూడా ఇష్టమైన పని చేసుకుంటూ..కుటుంబ విలువలను చూపించే మరో బలగం లాంటి  మూవీ 'తండట్టి'.  రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న బలగం.. ప్యూర్ ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ కథతో వచ్చి  ఆడియన్స్ మనసును హత్తుకుంది..వారి చేత కన్నీళ్లు పెట్టించింది. ఇప్పుడు అదే జోనర్ లో వచ్చిన  'తండట్టి' మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 

రోహిణి, పశుపతి, దీపా శంకర్, అమ్ము అభిరామి, వివేక్ ప్రసన్న, మీనల్ తదితరులు ఈ మూవీలో నటించారు. సామ్ సి ఎస్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.