బ్యాంక్ మాజీ సీఈవోను బ్లాక్ మెయిల్.. ATMలా రూ.4 కోట్లు కొట్టేసిన మహిళ..

బ్యాంక్ మాజీ సీఈవోను బ్లాక్ మెయిల్.. ATMలా రూ.4 కోట్లు కొట్టేసిన మహిళ..

అతను ముంబై సిటీలో పరువు, మర్యాద ఉన్న వ్యక్తి.. ఓ ప్రముఖ బ్యాంకుకు సీఈవోగా చేసిన రిటైర్ అయ్యాడు. అతన్ని టార్గెట్ చేసింది ఓ మహిళ.. నాలుగేళ్ల పాటు బ్లాక్ మెయిల్ చేసి.. 108 సార్లు.. విడదలవారీగా.. అతని నుంచి అక్షరాల 4 కోట్ల 39 లక్షల రూపాయలు కొట్టేసింది.. పాపం ఆ బ్యాంక్ మాజీ సీఈవో.. ఈ మహిళ బ్లాక్ మెయిలింగ్ కు భయపడి.. ఉన్న ఇంటిని అమ్మేశాడు.. పీఎఫ్ డబ్బు మొత్తం ఇచ్చేశాడు.. మళ్లీ బ్యాంక్ లో అప్పు చేసి మరీ ఈ మహిళకు కట్టాడు.. ఈ ఉదంతం ముంబైలో కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. థానేకి చెందిన 45ఏళ్ళ మహిళ వదాలలోని కోఆపరేటివ్ బ్యాంకుకి లోన్ కోసం వెళ్ళింది. ఆ బ్యాంకు సీఈఓగా పని చేస్తున్న 66ఏళ్ళ వ్యక్తితో అప్పుడే ఆమెకు పరిచయం ఏర్పడింది.

సదరు కిలేడి బ్యాంకు లోన్ కోసం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అసంపూర్ణంగా ఉన్న నేపథ్యంలో వెరిఫికేషన్ కోసం ఆమె ఇంటికి వెళ్ళాడు బ్యాంకు సీఈఓ. ఆ సమయంలో అతన్ని బుట్టలో పడేసి శారీరక సంబంధం ఏర్పరచుకుంది.ఆ తర్వాత 7300 ఈఎంఐతో 3లక్షల లోన్ శాంక్షన్ చేసింది బ్యాంకు. ఇంకొన్నాళ్ల తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ సదరు సీఈఓకు ఫోన్ చేసింది మహిళ. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తన మొబైల్ లో ఉన్న సీఈఓ న్యూడ్ ఫోటోలు ఫ్యామిలీకి, కొలీగ్స్ కి పంపుతానంటూ బెదిరించటం స్టార్ట్ చేసింది.

రేప్ కేసు పెడతానంటూ ఆమె బెదిరించడంతో ఆ రిటైర్డ్ సీఈఓ తన ఫ్లాట్ అమ్మేసి, పీఎఫ్ డబ్బులు డ్రా చేసి, స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ, ఆరేళ్లలో 108వాయిదాల్లో మొత్తం 4కోట్ల 39లక్షలు ఆమెకు ఇచ్చాడు. అయినప్పటికీ ఆమె బ్లాక్ మిల్లింగ్ ఆపలేదు, దీంతో విసిగిపోయిన అతను పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చాడు. అతని నుండి కంప్లైంట్ అందుకున్న పోలీసులు ఆమెను ట్రాప్ చేసి అదుపులోకి తీసుకున్నారు.