ఒకే రోజు మహిళకు 3 డోసుల వ్యాక్సిన్

ఒకే రోజు మహిళకు 3 డోసుల వ్యాక్సిన్

ముంబై: మహారాష్ట్రలోని థానె సిటీలో హెల్త్​సిబ్బంది ఓ మహిళ(28)కు ఒకే రోజు నిమిషాల తేడాతో మూడు డోసుల వ్యాక్సిన్​వేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థానె సిటీకి చెందిన ఓ మహిళ ఈ నెల 25న వ్యాక్సిన్​వేయించుకోవడానికి దగ్గరలోని హెల్త్​సెంటర్​కు వెళ్లింది. వ్యాక్సిన్​ వేసిన హెల్త్​ సిబ్బంది.. వేయడం పూర్తయింది, ఇక ఇంటికి వెళ్లాలని చెప్పలేదు. వ్యాక్సినేషన్​పై అవగాహన లేకపోవడంతో ఆమె అక్కడే నిలబడింది. దీంతో హెల్త్​ సిబ్బంది నిమిషాల తేడాతో మూడు డోసుల వ్యాక్సిన్​ వేశారు. తనకు మూడు సార్లు వ్యాక్సిన్​ వేశారని ఆమె భర్తతో చెప్పింది. విషయం విని భయపడిన ఆమె భర్త లోకల్​ కార్పొరేటర్​ కవిత సురేశ్​ పాటిల్​ను కలిశాడు. విషయం వెలుగులోకి రావడంతో థానె మున్సిపల్​ కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది. మహిళ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన హెల్త్​ ఆఫీసర్ ​ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యాక్సిన్ ​వేసిన హెల్త్​ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్​మనోహర్​ డుంబ్రే సహా పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.