డాక్టర్లకు, నర్సులకు గూగుల్ డూడుల్ థ్యాంక్స్ చెప్పింది

డాక్టర్లకు, నర్సులకు గూగుల్ డూడుల్ థ్యాంక్స్ చెప్పింది

కరోనా నివారణకు కృషి చేస్తున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ సిబ్బంది సేవలను కొనియాడుతూ గూగుల్ డూడుల్ థ్యాంక్స్ చెప్పింది. డాక్టర్లు, నర్సులు, వైద్య ఉద్యోగులందరికీ థ్యాంక్స్’ అంటూ ప్రత్యేక లోగోతో పాటు హార్ట్ సింబల్ ఎమోజీని గూగుల్ ప్రదర్శించింది. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా పేషెంట్లకు డాక్టర్లు ట్రీట్​మెంట్ చేస్తున్నారు. ఇటువంటి కష్ట సమయంలో గూగుల్ వరుస డూడుల్ లను ప్రదర్శిస్తూ హెల్త్ సిబ్బందికి మద్దతు ప్రకటిస్తోంది. ప్రాణాలు తీస్తున్న వైరస్ ను ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేస్తున్నవారందరినీ గూగుల్ ప్రశంసించింది.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలను ప్రభావితం చేస్తూ.. ప్రజలంతా ఒకరికొకరు సాయపడేందుకు కలిసి వస్తున్నారు. అందులో అందరికన్నా ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, సైంటిస్టులు, హెల్త్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు, టీచర్లు, వస్తుసేవలు అందించే వారందరికీ థ్యాంక్స్’’ అని గూగుల్ చెప్పింది.