ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా భట్ రోల్ పై జక్కన్న క్లారిటీ

ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా భట్ రోల్ పై జక్కన్న క్లారిటీ

ఆర్ ఆర్ ఆర్ లో సీత పాత్రకు ఆలియా బట్ ను ఎందుకు ఎంపిక చేసుకున్నామో జక్కన్న చెప్పారు.  దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ ఆర్ ఆర్ ’ (రౌద్రం రుధిరం రణం). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అయితే తాజాగా జక్కన్న ఈ సినిమాలో సీత పాత్ర కోసం ఆలియా బట్ ఎందుకు సెలక్ట్ చేసుకున్నారో చెప్పే ప్రయత్నం చేశారు.

సీత పాత్ర కోసం తారక్, చరణ్ మధ్య నిలబడగలిగే నటి నాకు కావాలి. అమాయకం, హుషారు, పౌరుషం ఉట్టేపడేలా. ఎందుకంటే వాళ్లిద్దరూ ఎంతో ప్రతిభ కలిగిన నటులు. అలా అని ఇది త్రికోణ ప్రేమకథ కాదని తెలిపారు.  అందుకనే ఈ పాత్ర కోసం ఆలియా భట్‌ను ఎంపిక చేసుకున్నాను అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు రాజమౌళి.  రాజమౌళి మాటలను బట్టి చూస్తే సినిమాలో ఆలియా భట్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉన్నట్టు అర్థమవుతోంది.