అదిగో నీరు.. ఇదిగో పులి.. వైరల్​ అవుతున్న వీడియో

అదిగో నీరు.. ఇదిగో పులి.. వైరల్​ అవుతున్న వీడియో

పులి అకస్మాత్తుగా కనిపిస్తే మనం ఎంతలా భయపడతాం.. అలాంటి పరిస్థితే ఓ దట్టమైన అడవిలో ప్రయాణికులు ఎదుర్కొన్నారు. ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​ అధికారి పర్వీన్​ కస్వాన్​ ఉత్తర్​ప్రదేశ్​లోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా వెళ్తున్న జాతీయ రహదారి పక్కన బెంగాల్​ పులి నీరు తాగుతున్న వీడియోను సోషల్​ మీడియాలో పంచుకున్నారు. దప్పిక తో ఉన్న ఆ పులి కుంటలో నీటిని తాగి దాహం తీర్చుకుంటున్నది వీడియోలో స్పష్టం గా కనిపిస్తోంది.  ఈ దృశ్యాన్ని చూసిన వాహనదారులు రెండు వైపుల తమ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు.  "ది రోడ్ స్టాపర్" అని తమకు నచ్చిన రీతిలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు.  ట్విటర్​లో ఈ వీడియోని 40 వేల మందికి పైగా చూశారు.