అందుకే రైటర్‌‌‌‌‌‌‌‌నయ్యా!

అందుకే రైటర్‌‌‌‌‌‌‌‌నయ్యా!

గుంటూరు టాకీస్, కృష్ణ అండ్‌‌‌‌ హిజ్‌‌‌‌ లీల వంటి చిత్రాల్లో నటించిన సిద్ధు జొన్నలగడ్డ.. ఈసారి ‘డీజే టిల్లు’గా వస్తున్నాడు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలవుతున్న సందర్భంగా సిద్ధు చెప్పిన సంగతులు.
‘‘లవ్‌‌‌‌, క్రైమ్‌‌‌‌ ప్యారలల్‌‌‌‌గా రన్‌‌‌‌ అయ్యే స్టోరీ. ఫస్ట్‌‌‌‌ లాక్‌‌‌‌ డౌన్‌‌‌‌లో నేను, డైరెక్టర్ విమల్ కృష్ణ కలిసి ఈ స్క్రిప్ట్ రాశాం. సికింద్రాబాద్ ఏరియాలో టిల్లు తరహా క్యారెక్టర్స్‌‌‌‌ని చూస్తూ పెరిగాను. వాళ్లంతా తమకు తాము బాసుల్లా ఫీలవుతుంటారు. అలాంటి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను స్క్రీన్‌‌‌‌ పై చూపించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికి కుదిరింది. నాకు తెలిసిన పాత్రే కనుక ఈజీగా చేసేశాను. స్క్రిప్ట్ విషయానికొస్తే కొన్ని రోజులు క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎలిమెంట్స్, మరికొన్ని రోజులు స్టోరీ ఎలిమెంట్స్ రాశాం. త్రివిక్రమ్ గారితో మాట్లాడితే సూచనలు చెప్పేవారు. అవన్నీ మా స్టైల్‌‌‌‌లోనే అడాప్ట్ చేయమనేవారు. సితార బ్యానర్‌‌‌‌‌‌‌‌లో సినిమా అంటే ప్రాబ్లమ్స్‌‌‌‌ ఉండవు. ట్రైలర్‌‌‌‌‌‌‌‌ చూసి డెక్కన్ సినిమాలా ఉందంటున్నారంతా. అవును.. కచ్చితంగా ఇది డెక్కన్ సినిమానే. పార్ట్‌‌‌‌ 2 తీద్దామనే ఆలోచన కూడా ఉంది. మనమే రాసుకుంటే నటుడిగా అవకాశాలొస్తాయనే తపన నుంచే రైటర్‌‌‌‌‌‌‌‌ అయ్యాను. అన్నింట్లో ఇన్‌‌‌‌వాల్వ్ అవ్వాలని  ‘నువ్వలా’ అనే పాట పాడలేదు. అది ‘గుంటూరు టాకీస్‌‌‌‌’ కోసం పాడిన పాట. అప్పుడు వాడలేదు. ఆ తర్వాతి సినిమాల్లో పెట్టాలనుకున్నా వీలుపడలేదు. ఇప్పుడు వీలయ్యి పెట్టామంతే.’’

మరిన్ని వార్తల కోసం

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

కేసీఆర్ వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు