
మొక్కలు మనిషికి ఆహ్లాదాన్నిస్తాయన్నారు.. మంత్రి హరీశ్ రావు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో 11వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించారు. గార్డెన్ ప్రేమికులకు మేళా ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. అన్ని రకాల మొక్కులు మేళాలో అందుబాటులో ఉన్నాయన్నారు. నర్సరీ మేళా ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు కొనసాగనుంది.