ఈ ఇనప కంచె తోనే చైనా మన సైనికులపై దాడి చేసింది

ఈ ఇనప కంచె తోనే చైనా మన సైనికులపై దాడి చేసింది

దొంగ దెబ్బతీయడం ప్రపంచ దేశాల్లో చైనాను మించిన దేశం మరొకటి లేదని తెలుస్తోంది. 70 ఏళ్ల నుంచి భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా గత 70 ఏళ్ల నుంచి ప్రతీ సంవత్సరం 300సార్లు కవ్వింపులకు పాల్పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలా భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు  చైనా జిత్తులు మారిన నక్కలా ఎత్తుకు పై ఎత్తు వేస్తుంటే ఆ ఎత్తుల్ని మన భారత సైనికులు చిత్తు చేస్తున్నారు.  చైనాకు గుణపాఠం నేర్పిస్తున్నారు.

ఇండియా టుడే కథనం ప్రకారం..

భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాల్ని భారత సైనికులు తిప్పికొట్టారు. 16బీహార్ రెజిమెంట్ లో కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలో చైనా సైనికుల్ని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు మన సైనికులు. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ భీకర పోరులో భారత సైనికులు చైనాకు చెందిన 40మంది సైనికుల్ని హతమార్చగా.. 20మంది మన సైనికులు వీరమరణం పొందారు.  అయితే అదే సమయంలో  చైనా సైనికులు భారత సైనికుల పై చేసిన దాడి చేసిన తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడిలో  చైనా సైనికులు చేతికి దొరికిన రాళ్లు, కంచెలతో మన సైనికుల ప్రాణాల్ని తీయడం, తీవ్రంగా గాయ పరిచిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని దారుణమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఫొటోలో ఇనప కంచెతో భారత సైనికులపై చైనా సైనికులు ఎంత దారుణంగా దాడి చేశారో వాటిని చూస్తే అర్ధం అవుతుంది. రక్తంతో తడిసిన ఆ ఇనప కంచెలు భారత సైనికుల పోరాట పటిమను గుర్తు చేస్తున్నాయి.

కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలో అత్యంత ఇరుకైన  గల్వాన్ వ్యాలీలో చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొనడం సాధారణ విషయం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగే సమయంలో ఎటువంటి కాల్పులు జరగలేదని, అయినా భారత సైన్యం చైనా కు చెందిన 40మంది సైన్యాన్ని హత మార్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.