అక్టోబర్ 15 నుంచి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

అక్టోబర్ 15 నుంచి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి కరీంనగర్‌ వరకు 5వ విడత పాదయాత్ర కొనసాగనుంది. బాసర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్‌ భైంసా నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

బండి సంజయ్ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,260 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశారు. గతేడాది ఆగస్టు 28వ తేదీన చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి తొలి విడత పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.