8వ ఎడిషన్ ఎగ్జిబిషన్ ఫర్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ప్రారంభం

8వ ఎడిషన్ ఎగ్జిబిషన్ ఫర్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహకారంతో ఫార్మాసూటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్​) నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఫర్ ఫార్మా అండ్ హెల్త్ కేర్’ (ఐఫెక్స్) 8వ ఎడిషన్ ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు జరగనుంది.  ఈ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్​ను నోయిడా ఇండియా ఎక్స్ పో సెంటర్ లో నిర్వహిస్తారు. ఐపీహెచ్​ఈఎక్స్​ చైర్మన్​, లారస్ ల్యాబ్స్​ సీఈఓ డాక్టర్​ చావా సత్యనారాయణ,  ఫార్మాక్సిల్​ డైరెక్టర్ జనరల్  రవి ఉదయభాస్కర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. పలు దేశాల హెల్త్​ రెగ్యులేటరీ ఆఫీసర్లు, పబ్లిక్ ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీలు, దిగుమతిదారులు,  ఎగ్జిబిటర్లు,  ఫారిన్​ డెలిగేట్లు , సందర్శకులు ఎగ్జిబిషన్​కు వస్తారు.  ఈసారి ఎన్. ఎ.ఎఫ్. టి. ఎ, ఈయూ, ఏఎస్ ఈ ఏఎన్, సీఐఎస్, ఎల్ ఏసీ తదితర ప్రాంతాలను కవర్ చేసే రెగ్యులేటరీ ఏజెన్సీ ఆఫీసర్లతో ప్రత్యేకమైన వ్యాపార సమావేశాలతోపాటు చర్చా కార్యక్రమాలు ఉంటాయి. బిజినెస్ మీటింగుల్లో120కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. దీనివల్ల ఇండియా ఫార్మాకు ఎంతో మేలు జరుగుతుంది.

మార్కెట్లోకి ఐకూ జెడ్6 లైట్ 
స్మార్ట్​ఫోన్ ఐకూ ఇండియా మార్కెట్లో జెడ్6 లైట్ 5జీ ఫోన్​ లాంచ్ చేసింది. క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 1 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 120హెజ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ   కెమెరా, ఆండ్రాయిడ్ 12 వెర్షన్ దీని ప్రత్యేకతలు. ఇందులో 6.58 ఇంచుల స్క్రీన్​ ఉంటుంది.  ఐకూ జెడ్6 లైట్ 4జీబీ+64జీబీ  వేరియంట్​ ధర  రూ. 14 వేలు కాగా, 6జీబీ+64 జీబీ వేరియంట్ ధర 15,499. ఈ నెల 14 నుంచి సేల్స్​ మొదలవుతాయి.