పోలీసుల సోదాలు చట్టవిరుద్ధం

పోలీసుల సోదాలు చట్టవిరుద్ధం

న్యూఢిల్లీ: అహ్మదాబాద్​లోని తమ పార్టీ ఆఫీసులో పోలీసులు జరిపిన తనిఖీలు చట్టవిరుద్ధమని, దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆమ్​ ఆద్మీ పార్టీ పేర్కొంది. సోదాల గురించి తాము అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్​ సిద్ధంగా ఉంటే ఆ ఆధారాలు చూపుతామని ఆప్​ అధికార ప్రతినిధి సౌరభ్​ భరద్వాజ్​ తెలిపారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ  ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కోర్టు ఆర్డర్​ కానీ, వారంట్​ కానీ లేకుండానే  పోలీసులు అహ్మదాబాద్​ పార్టీ కార్యాలయంలో  దౌర్జన్యంగా ప్రవేశించి, రెండు గంటలపాటు తనిఖీలు చేశారని ఆయన ఆరోపించారు. సోదాలు ముగించి వెళ్తున్నపుడు తాము మళ్లీ వస్తామని బెదిరించారని అన్నారు. ఆప్​ చీఫ్ అర్వింద్​ కేజ్రీవాల్​కు గుజరాత్​లో పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ భయపడుతోందని ఆయన పేర్కొన్నారు.